Sunday, 27 November 2011

నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

తియ్యనైన ఈ ప్రేమ ఆనందమో బాధో అర్ధం కాని ఈ పరిస్తితి ఏంటో నాకు అర్ధం కావట్లేదు ప్రియతమ..! దూరమైతే ప్రేమ పెరుగుతుంది అని ఎవరో చెప్పారు.. కనీ అది నిజం గా నిజం అని ఎందుకో అనిపించటం లేదు... నువ్వు దూరమైనా ప్రతీ క్షణం నాకు నరకం గ అన్పిస్తోంది... ఎందుకిలా... నువ్వు లేని ఇన్నాళ్ళు ఎలాంటి బాధలు, విరహాలు ఏమి లేవు, అయినా సరే ఈ నీ ప్రేమ కోసమైనా నీ ప్రణయ విరహ బాధకోసమైనా నేను సిద్దంగా ఉన్నాను.. అంతే కాదు, ఈ ఈ విరహ వేదనలోనే కనుమూసి నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

నువ్వు కనీసం చుదకపొఇనా ప్రతీ క్షణం నీ చూపుల వర్షంలో తడవాలని ఎదురుచూసే ఇట్లు నీ నేను.

Friday, 25 November 2011





ఏదో తెలియని ఆనందం..

ఎందుకో తెలియని సంతోషం..

నలుదిక్కులు అలుపెరుగక వెతికిన నా కళ్ళకి

నిన్ను చూడగానే జీవం ఒచ్చింది.

అనుకోకుండా జగమంతా రంగులమయం ఐపోయింది.

ఏమిటీ ఇంద్రజాలం...

నిన్ను చూడకుండా గడిపిన ఇన్నిరోజులు యుగాలుగా గడిచినా,

ఒక్కసారి నువ్వు కనపడగానే నాపై అమృత వర్షం కురుస్తోందా అన్పిస్తోంది.

Tuesday, 22 November 2011

తన గుండెలో ఉన్న నాకోసం జగమంత వెతుకుతున్న పిచ్చి ప్రేమే నా ప్రేయసి...!