Monday 16 July 2012

కత్తి తీసుకుని నన్ను ముక్కలు చేసి చంపెయ్యి


నిన్ను కలవకముందు ప్రేమంటే పిచ్చి అనుకున్నా..
కానీ ఎందుకో తెలియదు,
నువ్వు దూరమవుతున్న ప్రతీ క్షణం నాకు పిచ్చెక్కిపోతోంది..!
ఎదో తెలియని బాధ..
ఎన్నో కావ్యాలు పలికిన నా పెదవులకి ఈరోజు
ఈ బాధని వర్ణించటానికి పదాలే రావటం లేదు..
గుండెని ఎవరో పిండేస్తున్నట్లుంది..
నువ్వు నా కళ్ళెదుటే ఉన్నా కానట్టు ఉంటుంటే
ఈ దేహం కాలి బూడిదైపోయినా మంచిదనిపిస్తోంది..
కత్తి తీసుకుని నన్ను ముక్కలు చేసి చంపెయ్యి, కానీ
ఇలా కళ్ళెదుటే ఉంటూ కానరాని నరకాన్ని చూపించి క్షణానికి  పదిసార్లు చంపద్దు..!

Sunday 8 July 2012

వేయి నరకాలైనా సహిస్తాను కానీ..,

నీ అధరాల మధురిమలు చాలు
నేను జన్మజన్మలు గడపడానికి..

కానీ, ఎందుకో తెలియదు..
నీ ఎడబాటును క్షణమైనా భరించలేను...

వేయి నరకాలైనా సహిస్తాను కానీ
నీ ఎడబాటుని క్షణమైనా తట్టుకోలేను..

ఎన్నటికీ నాచేయి విడువవనే
నమ్మకమే ఇప్పుడు నన్ను బ్రతికిస్తోంది..!

జామురాతిరివేళ చల్లని జాబిలి

చెలియా.. నీ చూపులు నన్ను తాకిన క్షణమున
చిరుజల్లుల చల్లని తేనెలు
నా హ్రుదయాన్నే తడిపేస్తున్నాయా అనిపిస్తోంది..

ఏదో తెలియని ఉత్సాహం..
ఎందుకో తెలియని ఆనందం..

జామురాతిరివేళ చల్లని జాబిలి
వెన్నెలలు కురిపిస్తోందా అనిపిస్తోంది నీ నవ్వు చూస్తుంటే..

ప్రేమా... ఓ.. ప్రేమా..!

నా ప్రేమకి ప్రాణం నీవు
ఈ ఇలలో అందానికి అర్దం నీవు..

కళ్ళల్లో కలవైనావు
గుండెల్లో గుచ్చేశావు

ఎన్నాళ్ళో వేచిన హ్రుదయం
ఈనాడే కరుణించావు.. ప్రేమా... ఓ.. ప్రేమా..!

Tuesday 3 April 2012

ఏమీ చేసినా ప్రియురాలి కళ్ళలో ప్రేమ చూడ లేదు.

ప్రేమ
  ఇది రెండు అక్షరాల మహాసాగరం. కొందరికి ముత్యాలు దొరికితే, కొందరికి 'దరే' దొరకదు- ఉప్పు (క)న్నీరు తప్ప. నదీనధములు అన్నీ సాగరాన్ని కలిసినట్టే, అన్ని రకాల భావాలు ప్రేమతోనో, ప్రేమచేతనో, ప్రేమలోనో మమేకమవుతాయి.

పొత్తిళ్ళలో పడినప్పుడు, వడిలో పరుండబెట్టి పాలు పట్టునపుడు అమ్మ కళ్ళలో ప్రేమ. రెండు అరచేతుల్లో ఒదిగి పోయిన పసిబిడ్డను తీసుకున్న తండ్రి కళ్ళలో ప్రేమ. తనతో ఆడడానికి, పోట్లాడడానికి ఒక నేస్తం దొరికాడని  , ఆ చిన్ని వేళ్ళను తాకినపుడు తోబుట్టువు కళ్ళలో ప్రేమ. తమ ఇంటిపేరు నిలబెట్టడానికి , తమ తనయుని తండ్రి చేస్తూ, తమ వంశం వృద్ది చెందుతుందన్న ఆనందంతో నానమ్మ,తాతల కళ్ళలో ప్రేమ. తమ బిడ్డను వేరొక ఇంట్లో ఇచ్చామనే భాదను శాశ్వతంగా చెరిపి వేస్తూ, తమ బిడ్డను తమ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోగలిగిన వాడు ఒకడు వచ్చాడని తలచి పులకించే అమ్మమ్మ,తాతయ్య కళ్ళలో  ప్రేమ.

ఇన్ని ప్రేమల మధ్యలో మొదలైన ప్రేమ... తెరిచీ-తెరవని, మూసి-మూయని ఆ పసి వాడి కళ్ళలో....

--------------------------------------------------------------------------------
వయసు రాగానే , ( కళ్ళకు - ప్రేమకు వున్న ఏదో తెలియని అవినాభావ సంబంధంతో కాబోలు) ఒక అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాయి ఆ చురుకైన , పదునైన కళ్ళు...
---------------------------------------------------------------------------------
మనకు దెబ్బ తగిలితే అమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగుతాయి మన మీద వున్న ప్రేమతో... బాధగా
మనకు మంచి పేరు వస్తే నాన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి మన మీద వున్న ప్రేమతో... గర్వంగా
మనకు ప్రతీ విషయంలో పోటీపడుతూ, కవ్విస్తూ, బుజ్జగిస్తూ, మమకారం అనే పాశంతో మనల్ని వదిలి ఉండలేక , కాని అది తప్పక,
అత్తవారింటి వెళుతూ, తోడబుట్టిన దాని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి మన మీద వున్న ప్రేమతో... బెంగగా

ఇంతమంది మనకోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే ...ప్రేమతో....
వాళ్ళని కాళ్ళ తన్ని, వారికి శాశ్వత కన్నేరేయ్ మిగిల్చి .....

వయసు తెచ్చిన పొగరుతో , కళ్ళ కెక్కిన కైపులో ... ప్రేమ సాగరంలోని.ఆ ముత్యాలను వదిలి , ఉప్పు నీటి(కన్నీటి)కై  పరుగులు తీస్తున్నాం.
మనల్ని నిజంగా ప్రేమించే వారి ప్రేమను కాలరాసి, కనులు మూసుకు పోయిన మనకు కన్నీరే మిగిలే చివరికి.

----------------------------------------------------------------------------------
తను చెప్పిన మాట విన్నప్పుడు అమ్మ కళ్ళలో ఆనందం చూచాను.
తనకిచ్చిన మాట నిలుపుకున్నప్పుడు నాన్న కళ్ళలో సంతోషం చూచాను.

తన కోసం ఎంత చేసినా ,ఏమీ చేసినా ప్రియురాలి కళ్ళలో ప్రేమ చూడ లేదు.

ప్రేమంటే రెండు మనసుల కలయిక అనుకున్నాను.కాని ఒక మనసును ఆనందంగా ఉంచడానికి మరొక మనసు పడే వేదన అనుకోలేదు.
ప్రేమంటే రెండు మనసులు ఒకటై వుంటాయి అనుకున్నాను.కాని ఒక్క మనసు మాత్రమే ( మరొక మనసు కోసం) పరితపిస్తుంది అనుకోలేదు.
అడగకుండా  ఇచ్చే దేనికీ విలువ ఉండదని తెలుసు , అది ప్రేమకు కూడా వర్తిస్తుందని తెలియదు. మొదట నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమే నా తప్పా???
నిన్ను ప్రేమ'ఇవ్వడమే' తప్పా ?????//

మొదట నువ్వే మాట కలిపావ్..ఇప్పుడు నాకు మౌనాన్నే మిగిల్చావ్...

నీ తలపులో, నీకై ఎదురు చూపులో గడిపిన ప్రతీ క్షణం నా మదిలో ఒక నవ వసంతం... కాని అది గతం.
నీకై తలచిన , నీ కొరకై ఎదురు చూచిన ఆ క్షణాలు  తలుచుకుంటుంటే నా మదిలో గ్రీష్మ తాపం... ఇది ప్రస్తుతం.
 గతానికి, ప్రస్తుతానికి మధ్య తేడా - 'నా' అనుకున్న 'నువ్వు' నాకు లేకుండా, నాకు కాకుండా పోవడం అనేది జీర్ణించుకోలేని వాస్తవం.
అయినా నువ్వేం చేయగలవు లే????
 నా అనంత ప్రేమను తట్టుకోలేని నీ గుప్పెడు గుండెదే తప్పు.
నా అపరిమితమైన ప్రేమను బంధించలేని నీ మనసుదే తప్పు.

నీ పై నాకున్న "ఎక్కువ(వల్ల మాలిన)" ప్రేమే , నిన్ను నా నుంచి దూరం చేసినందుకు "ఆ ప్రేమ"ను ద్వేషిస్తున్నా....... అని అంటూ, అనుకుంటూ , మన పైన "నిజమైన ప్రేమను చూపించే" .... కాదు కాదు మనల్ని "నిజంగా ప్రేమించే"  వారి వద్ద సేదతీరాలని వెళ్ళే సరికి ...... అక్కడ కన్నీళ్ళే మిగిలే చివరికి......

నువ్వు-నేను-ఆనందం-అబద్ధం

మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా
మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!

నువ్వు లేక నేను లేను అన్నాను
నువ్వే నా ప్రాణమని  అన్నాను- (అది అబద్ధమే చెలి)
నువ్వు లేకున్నా, నువ్వు నాకు కాకున్నా , నేను ఇంకా ప్రాణంతోనే వున్నాను.

నీతో మాటాడితే బాగుందని, మాట్లాడుతుంటే బాగుంటుందని
నీతో మాట్లాడకుండా ఉండలేనని, నీతో మాట్లాడుతూనే వుండాలని ఉందని అన్నాను -(అది అబద్ధమే  చెలి).
 నీతో మాట్లాడుట లేదు, మాట్లాడుతూ లేను, మాట్లాడాలనుకోవడం లేదు.ఐన నేనున్నానే  చెలి.

నీ కనులు అందం... వాటి చూపులు మరింత అందం
నీ అధరాలు అందం... అవి నీ చిరునవ్వుతో అధిరితే అందం
నీ బుగ్గలు అందం... వాటి పై నీ సిగ్గు మొగ్గలు అందం అని ఎన్నో అన్నాను. ( అది అబద్ధమే చెలి)

నీ కళ్ళలోకి చూడలేకున్నాను, నీ చూపులు తాళ్ళలేకున్నాను
నీ పెదవులను, వాటి కులుకులను పట్టనట్టే ఉంటున్నాను.

నీ మెడ అందం, వాలు జడ అందం
నీ నడుము అందం, నీ నడక అందం
నీ పాదం అందం, వాటికున్న మువ్వల సవ్వడి అందం అన్నాను.( అది అబద్ధమే చెలి)
నీ మెడ వైపు, జడ వైపు,
నడుము వైపు,నడక వైపు చూడ లేకున్నాను.

నన్ను ఎంతగానో (ఏ)మార్చినావే  , నాకేదో మాయ చేశావే
ఎన్ని వచ్చినా( ఆటంకాలు), ఏమీ జరిగినా (అవరోధాలు) నిన్ను నేను వీడిపోను
నీవుంటేనే నాకానందం, నువ్వంటేనే నా ఆనందం అన్నాను.

అంతలోనే అంతగా మారిపోయానని అనుకుంటున్నావా చెలి.
నేనన్నవన్నీ అసత్యాలని అనుకుంటున్నావా చెలి.
ప్రాణం వుంది.దేహముంది.నేనున్నాను.
కాని ఆనందం లేదే చెలి. ఆనందంగా లేనే చెలి.
నా ఆనందం నీవే. నీ దగ్గరేనే ఉందే చెలి.

'నన్ను' నా కన్నా ఎవరూ ప్రేమించలేరని తెలుసుకున్నాక,
నీకు నా పైన ప్రేమ లేదని తెలిశాక,
మనం ప్రేమించేవారికన్నా, మనల్ని ప్రేమించేవారే మిన్నని ఎరిగాక,
నన్ను నేను ప్రేమిస్తునందుకు, నిన్ను నేను 'నా'కన్నా ఎక్కువగా ప్రేమించానని
నా పై నా ప్రేమను మళ్ళించా నీ పై నుంచి

కాని......

నీకు నేను దూరమై , నాకు నేను దగ్గరయ్యేసరికి, నా ఆనందానికి  కారణం నేను కాదని,
ఆ ఆనందానికి కారణం నువ్వేనని, నా  ఆనందమే నువ్వని తెలుసుకున్నాక... నీ గురించే ఆలోచిస్తున్నా....

మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!
మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా

Monday 20 February 2012

నీ ఆలొచనల ముళ్ళ తీగలతొ నన్ను కట్టి పడేస్తోంది...!!!!

అర్దవంతమైన నా స్నెహం లొ అపార్దాలకు తావు లెదు...!
అయినా నీవు నన్ను అర్దం చెసుకొనందుకు నాకెంతగానో బధగా ఉంది..

నీకు తెలుసు నా స్నెహం లొ దాపరికాలు లెవని...!
అయినా నా వద్ద నీ బాధలను, భావాలను దాస్తున్నందుకు నాకెంతగానో బధగా ఉంది..

వేయి అబద్దాలు ఇంకెన్నొ వేల క్షనాలు నిన్ను ఆనందం లొ ఉంచగలవని తెలిసినా,
నిజం మత్రమె ఊపిరిగా జీవిస్తున్న నా దగ్గరె నువ్వు అబద్దాలను ఆయువు చెయటం నాకెంతగానో బధగా ఉంది..

ఒక్క నువ్వు మత్రమె నా నిజమైన స్నెహమని భావించిన నాకు,
నీకు నాకన్నా ముక్యమైన వాళ్ళు ఉన్నరని తెలియగానే నాకెంతగానో బధగా ఉంది..

నీ కొసం ఎన్నొ వదులుకుని అనుక్షనం నీకై పరితపిస్తుంటే,
నీవెమో నన్ను కాక మిగిలిన వారిని వదలలెనని చెప్పకనె చెప్తుంటె నాకెంతగానో బధగా ఉంది..

ఇన్ని బాదలను వదిలించుకుందమని అనుకున్నా,
వీడలెని నీ స్నెహ బంధం నీ ఆలొచనల ముళ్ళ తీగలతొ నన్ను కట్టి పడేస్తోంది...!!!!

ఇట్లు.., ♥♥```నీ నేను```♥♥

Monday 13 February 2012

ప్రేమికుల రోజైనా ఒక చిన్న మాట మాట్లాడలేని ఈ దౌర్భాగ్యుడు

ఆహ్లాదకరమైన ప్రకృతి వొడిలో చుట్టూ రమణీయమైన అందాలు అలా నన్ను పలకరిస్తుంటే ఎక్కడో దూరంగా నిల్చుని నన్ను నీ కౌగిలికి ఆహ్వానిస్తుంటే ఒక్కసారిగా అలారం మోగింది. అప్పుడు అర్దమైంది అదంతా నా కల అని..
ఇలా నా జీవితం కోటి "కల"ల సాగర తీరం లో నీ ప్రణయ ఆటుపోటుల మద్య కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది.
 ప్రతి రోజు నీ నవ్వు లో రతనాల మూటలను కట్టుకునే నేను ఆ నవ్వులు నాకోసం కావని తెలిసినపుడల్లా క్షణానికి వేయి సార్లు మరణిస్తున్నాను..
ఎన్నో జంటలు ఈరోజు తమ ప్రేమ ఊసులు చెప్పుకుంటూ, బహుమతులు, రోజాలు ఇలా లోకాన్ని మరచి తమ ప్రేమాలలో ఎవరికీ వారు ఒక కొత్త లోకాన్ని నిర్మించుకునే ఈ ప్రేమికుల రోజైనా ఒక చిన్న మాట మాట్లాడలేని ఈ దౌర్భాగ్యుడు నిమిషానికో నరకం అనుభవిస్తున్నాడు. నీ స్నేహం తో నా పతీ క్షన్నాన్ని ఎంతో సుందరం గా మార్చిన నువ్వే ఈనాడు ఇలా నిర్దాక్షిణ్యం గా ఉంటె నా సున్నితమైన హృదయం తట్టుకోలేకపోతోంది.. సేకనుకోసారి మృత్యువుతో పోరాడి నువ్వు మల్లి ఎప్పటికైనా దక్కుతావనే చిన్ని ఆశ అనే ఆయుధం తో పోరాటం సాగిస్తోంది.