Tuesday 3 April 2012

ఏమీ చేసినా ప్రియురాలి కళ్ళలో ప్రేమ చూడ లేదు.

ప్రేమ
  ఇది రెండు అక్షరాల మహాసాగరం. కొందరికి ముత్యాలు దొరికితే, కొందరికి 'దరే' దొరకదు- ఉప్పు (క)న్నీరు తప్ప. నదీనధములు అన్నీ సాగరాన్ని కలిసినట్టే, అన్ని రకాల భావాలు ప్రేమతోనో, ప్రేమచేతనో, ప్రేమలోనో మమేకమవుతాయి.

పొత్తిళ్ళలో పడినప్పుడు, వడిలో పరుండబెట్టి పాలు పట్టునపుడు అమ్మ కళ్ళలో ప్రేమ. రెండు అరచేతుల్లో ఒదిగి పోయిన పసిబిడ్డను తీసుకున్న తండ్రి కళ్ళలో ప్రేమ. తనతో ఆడడానికి, పోట్లాడడానికి ఒక నేస్తం దొరికాడని  , ఆ చిన్ని వేళ్ళను తాకినపుడు తోబుట్టువు కళ్ళలో ప్రేమ. తమ ఇంటిపేరు నిలబెట్టడానికి , తమ తనయుని తండ్రి చేస్తూ, తమ వంశం వృద్ది చెందుతుందన్న ఆనందంతో నానమ్మ,తాతల కళ్ళలో ప్రేమ. తమ బిడ్డను వేరొక ఇంట్లో ఇచ్చామనే భాదను శాశ్వతంగా చెరిపి వేస్తూ, తమ బిడ్డను తమ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోగలిగిన వాడు ఒకడు వచ్చాడని తలచి పులకించే అమ్మమ్మ,తాతయ్య కళ్ళలో  ప్రేమ.

ఇన్ని ప్రేమల మధ్యలో మొదలైన ప్రేమ... తెరిచీ-తెరవని, మూసి-మూయని ఆ పసి వాడి కళ్ళలో....

--------------------------------------------------------------------------------
వయసు రాగానే , ( కళ్ళకు - ప్రేమకు వున్న ఏదో తెలియని అవినాభావ సంబంధంతో కాబోలు) ఒక అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాయి ఆ చురుకైన , పదునైన కళ్ళు...
---------------------------------------------------------------------------------
మనకు దెబ్బ తగిలితే అమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగుతాయి మన మీద వున్న ప్రేమతో... బాధగా
మనకు మంచి పేరు వస్తే నాన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి మన మీద వున్న ప్రేమతో... గర్వంగా
మనకు ప్రతీ విషయంలో పోటీపడుతూ, కవ్విస్తూ, బుజ్జగిస్తూ, మమకారం అనే పాశంతో మనల్ని వదిలి ఉండలేక , కాని అది తప్పక,
అత్తవారింటి వెళుతూ, తోడబుట్టిన దాని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి మన మీద వున్న ప్రేమతో... బెంగగా

ఇంతమంది మనకోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే ...ప్రేమతో....
వాళ్ళని కాళ్ళ తన్ని, వారికి శాశ్వత కన్నేరేయ్ మిగిల్చి .....

వయసు తెచ్చిన పొగరుతో , కళ్ళ కెక్కిన కైపులో ... ప్రేమ సాగరంలోని.ఆ ముత్యాలను వదిలి , ఉప్పు నీటి(కన్నీటి)కై  పరుగులు తీస్తున్నాం.
మనల్ని నిజంగా ప్రేమించే వారి ప్రేమను కాలరాసి, కనులు మూసుకు పోయిన మనకు కన్నీరే మిగిలే చివరికి.

----------------------------------------------------------------------------------
తను చెప్పిన మాట విన్నప్పుడు అమ్మ కళ్ళలో ఆనందం చూచాను.
తనకిచ్చిన మాట నిలుపుకున్నప్పుడు నాన్న కళ్ళలో సంతోషం చూచాను.

తన కోసం ఎంత చేసినా ,ఏమీ చేసినా ప్రియురాలి కళ్ళలో ప్రేమ చూడ లేదు.

ప్రేమంటే రెండు మనసుల కలయిక అనుకున్నాను.కాని ఒక మనసును ఆనందంగా ఉంచడానికి మరొక మనసు పడే వేదన అనుకోలేదు.
ప్రేమంటే రెండు మనసులు ఒకటై వుంటాయి అనుకున్నాను.కాని ఒక్క మనసు మాత్రమే ( మరొక మనసు కోసం) పరితపిస్తుంది అనుకోలేదు.
అడగకుండా  ఇచ్చే దేనికీ విలువ ఉండదని తెలుసు , అది ప్రేమకు కూడా వర్తిస్తుందని తెలియదు. మొదట నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమే నా తప్పా???
నిన్ను ప్రేమ'ఇవ్వడమే' తప్పా ?????//

మొదట నువ్వే మాట కలిపావ్..ఇప్పుడు నాకు మౌనాన్నే మిగిల్చావ్...

నీ తలపులో, నీకై ఎదురు చూపులో గడిపిన ప్రతీ క్షణం నా మదిలో ఒక నవ వసంతం... కాని అది గతం.
నీకై తలచిన , నీ కొరకై ఎదురు చూచిన ఆ క్షణాలు  తలుచుకుంటుంటే నా మదిలో గ్రీష్మ తాపం... ఇది ప్రస్తుతం.
 గతానికి, ప్రస్తుతానికి మధ్య తేడా - 'నా' అనుకున్న 'నువ్వు' నాకు లేకుండా, నాకు కాకుండా పోవడం అనేది జీర్ణించుకోలేని వాస్తవం.
అయినా నువ్వేం చేయగలవు లే????
 నా అనంత ప్రేమను తట్టుకోలేని నీ గుప్పెడు గుండెదే తప్పు.
నా అపరిమితమైన ప్రేమను బంధించలేని నీ మనసుదే తప్పు.

నీ పై నాకున్న "ఎక్కువ(వల్ల మాలిన)" ప్రేమే , నిన్ను నా నుంచి దూరం చేసినందుకు "ఆ ప్రేమ"ను ద్వేషిస్తున్నా....... అని అంటూ, అనుకుంటూ , మన పైన "నిజమైన ప్రేమను చూపించే" .... కాదు కాదు మనల్ని "నిజంగా ప్రేమించే"  వారి వద్ద సేదతీరాలని వెళ్ళే సరికి ...... అక్కడ కన్నీళ్ళే మిగిలే చివరికి......

No comments:

Post a Comment