Tuesday 3 April 2012

నువ్వు-నేను-ఆనందం-అబద్ధం

మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా
మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!

నువ్వు లేక నేను లేను అన్నాను
నువ్వే నా ప్రాణమని  అన్నాను- (అది అబద్ధమే చెలి)
నువ్వు లేకున్నా, నువ్వు నాకు కాకున్నా , నేను ఇంకా ప్రాణంతోనే వున్నాను.

నీతో మాటాడితే బాగుందని, మాట్లాడుతుంటే బాగుంటుందని
నీతో మాట్లాడకుండా ఉండలేనని, నీతో మాట్లాడుతూనే వుండాలని ఉందని అన్నాను -(అది అబద్ధమే  చెలి).
 నీతో మాట్లాడుట లేదు, మాట్లాడుతూ లేను, మాట్లాడాలనుకోవడం లేదు.ఐన నేనున్నానే  చెలి.

నీ కనులు అందం... వాటి చూపులు మరింత అందం
నీ అధరాలు అందం... అవి నీ చిరునవ్వుతో అధిరితే అందం
నీ బుగ్గలు అందం... వాటి పై నీ సిగ్గు మొగ్గలు అందం అని ఎన్నో అన్నాను. ( అది అబద్ధమే చెలి)

నీ కళ్ళలోకి చూడలేకున్నాను, నీ చూపులు తాళ్ళలేకున్నాను
నీ పెదవులను, వాటి కులుకులను పట్టనట్టే ఉంటున్నాను.

నీ మెడ అందం, వాలు జడ అందం
నీ నడుము అందం, నీ నడక అందం
నీ పాదం అందం, వాటికున్న మువ్వల సవ్వడి అందం అన్నాను.( అది అబద్ధమే చెలి)
నీ మెడ వైపు, జడ వైపు,
నడుము వైపు,నడక వైపు చూడ లేకున్నాను.

నన్ను ఎంతగానో (ఏ)మార్చినావే  , నాకేదో మాయ చేశావే
ఎన్ని వచ్చినా( ఆటంకాలు), ఏమీ జరిగినా (అవరోధాలు) నిన్ను నేను వీడిపోను
నీవుంటేనే నాకానందం, నువ్వంటేనే నా ఆనందం అన్నాను.

అంతలోనే అంతగా మారిపోయానని అనుకుంటున్నావా చెలి.
నేనన్నవన్నీ అసత్యాలని అనుకుంటున్నావా చెలి.
ప్రాణం వుంది.దేహముంది.నేనున్నాను.
కాని ఆనందం లేదే చెలి. ఆనందంగా లేనే చెలి.
నా ఆనందం నీవే. నీ దగ్గరేనే ఉందే చెలి.

'నన్ను' నా కన్నా ఎవరూ ప్రేమించలేరని తెలుసుకున్నాక,
నీకు నా పైన ప్రేమ లేదని తెలిశాక,
మనం ప్రేమించేవారికన్నా, మనల్ని ప్రేమించేవారే మిన్నని ఎరిగాక,
నన్ను నేను ప్రేమిస్తునందుకు, నిన్ను నేను 'నా'కన్నా ఎక్కువగా ప్రేమించానని
నా పై నా ప్రేమను మళ్ళించా నీ పై నుంచి

కాని......

నీకు నేను దూరమై , నాకు నేను దగ్గరయ్యేసరికి, నా ఆనందానికి  కారణం నేను కాదని,
ఆ ఆనందానికి కారణం నువ్వేనని, నా  ఆనందమే నువ్వని తెలుసుకున్నాక... నీ గురించే ఆలోచిస్తున్నా....

మరుపన్నది వరమని తెలియదే, నీవు నాకు దూరమయ్యేంతవరకు
నిను మరవలేక, నీ మదిని చేరలేక వ్యధ మిగిలే చివరకు!!!!!
మరపు రాదే రమ్మన్నా నీ పై  ప్రియతమా
చొరవ చూపవే ఇకనైనా నా పై ప్రియతమా

No comments:

Post a Comment