Sunday, 18 December 2011

ఎగురుతున్న నా మనసు..!


చెలియ చూపులు నన్ను తాకిన క్షణమున
మనసే మధురిమలు పలుకుతుంటే..
చెలియ సొగసులే సరిగమలు పాడే వేల
నిండు పున్నమి వెన్నెలల పూల వర్షం కురిపిస్తుంటే...
ఎగురుతున్న పక్షులలో నా మనసు 
నాకూ రెక్కలోచ్చాయంటూ గర్వంగా చెప్పింది..! 


చేపకు నీరే ప్రపంచం
పక్షికి గాలే లోకం
అలాగే నాకు నువ్వే సర్వం...!


వందలాది సునామీలే ఒచ్చినా,
ఈ ప్రపంచం అంతా మునిగి పోయినా,
నన్ను లేకుండా చేస్తాయేమో కానీ,



నా మనసునీ.. నా మనసులోని నీ జ్ఞాపకాలను
కనీసం స్పురించాలేవు ప్రియతమా... 

ఇట్లు.., ♥♥```నీ నేను```♥♥

Tuesday, 6 December 2011

నీ ప్రేమ లేని జగతిలో జీవించలేను...

జీవితం లో ప్రతీ ఘటనకీ, ప్రతీ మజిలీకీ ఒక కారణం 
అంటూ ఉంటుంది. కానీ ఏమిటీ ఈ అనుభందం..?
నీతో ఎన్ని గొడవలైనా, ఎన్నిసార్లో అలకలు చిలకలై చిలకలై ఎగిరినా...,
కోపాలు, తాపాలు ఎన్ని ఒచ్చినా ఇంకా నిన్ను వీడలేకున్నాను.
నువ్వు నన్ను చీదరించుకున్నా, అసహ్యించుకున్నా సరే 
నిన్ను విడవాలని అనుకున్నా వీడలేకున్నాను... ఎందుకిలా..?
ఎన్నిసార్లో నామనసుని కట్టడి చేసినా 
మళ్ళీ అది నీ వైపే పరుగులు తీస్తోంది.
ఏమిటి నాతప్పు..? ఎందుకు నాకీ శిక్ష...?
నిన్ను అమితంగా ప్రేమించటమే నా నేరమా..?
ప్రతీ క్షణం ఎక్కడ నిన్ను 
కష్టాల నీడ తాకుతుందో అని తపన పడుతూ..,
ఎక్కడ నీవు తప్పటడుగు వేస్తావో 
అని అనుక్షణం ఆలోచించిన నా మనసుదే తప్పంటావా..?
ఎప్పటికీ నేను నీ చేలిమినే నంటూ చేసిన బాసలు ఎటు పోయాయో...
అనురాగం లేని నీ చూపులు, ప్రేమలేని నీ పలుకులు
నన్ను మరింత క్షోభకి గురిచేస్తున్నాయి...
ఇక నేను తాళలేను... ఈ నరకం అనుభవించలేను..
నీ ప్రేమ లేని జగతిలో జీవించలేను...

ఇట్లు.., ♥♥```నీ నేను```♥♥

Sunday, 27 November 2011

నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

తియ్యనైన ఈ ప్రేమ ఆనందమో బాధో అర్ధం కాని ఈ పరిస్తితి ఏంటో నాకు అర్ధం కావట్లేదు ప్రియతమ..! దూరమైతే ప్రేమ పెరుగుతుంది అని ఎవరో చెప్పారు.. కనీ అది నిజం గా నిజం అని ఎందుకో అనిపించటం లేదు... నువ్వు దూరమైనా ప్రతీ క్షణం నాకు నరకం గ అన్పిస్తోంది... ఎందుకిలా... నువ్వు లేని ఇన్నాళ్ళు ఎలాంటి బాధలు, విరహాలు ఏమి లేవు, అయినా సరే ఈ నీ ప్రేమ కోసమైనా నీ ప్రణయ విరహ బాధకోసమైనా నేను సిద్దంగా ఉన్నాను.. అంతే కాదు, ఈ ఈ విరహ వేదనలోనే కనుమూసి నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

నువ్వు కనీసం చుదకపొఇనా ప్రతీ క్షణం నీ చూపుల వర్షంలో తడవాలని ఎదురుచూసే ఇట్లు నీ నేను.

Friday, 25 November 2011





ఏదో తెలియని ఆనందం..

ఎందుకో తెలియని సంతోషం..

నలుదిక్కులు అలుపెరుగక వెతికిన నా కళ్ళకి

నిన్ను చూడగానే జీవం ఒచ్చింది.

అనుకోకుండా జగమంతా రంగులమయం ఐపోయింది.

ఏమిటీ ఇంద్రజాలం...

నిన్ను చూడకుండా గడిపిన ఇన్నిరోజులు యుగాలుగా గడిచినా,

ఒక్కసారి నువ్వు కనపడగానే నాపై అమృత వర్షం కురుస్తోందా అన్పిస్తోంది.

Tuesday, 22 November 2011

తన గుండెలో ఉన్న నాకోసం జగమంత వెతుకుతున్న పిచ్చి ప్రేమే నా ప్రేయసి...!