Sunday, 18 December 2011

ఎగురుతున్న నా మనసు..!


చెలియ చూపులు నన్ను తాకిన క్షణమున
మనసే మధురిమలు పలుకుతుంటే..
చెలియ సొగసులే సరిగమలు పాడే వేల
నిండు పున్నమి వెన్నెలల పూల వర్షం కురిపిస్తుంటే...
ఎగురుతున్న పక్షులలో నా మనసు 
నాకూ రెక్కలోచ్చాయంటూ గర్వంగా చెప్పింది..! 


చేపకు నీరే ప్రపంచం
పక్షికి గాలే లోకం
అలాగే నాకు నువ్వే సర్వం...!


వందలాది సునామీలే ఒచ్చినా,
ఈ ప్రపంచం అంతా మునిగి పోయినా,
నన్ను లేకుండా చేస్తాయేమో కానీ,



నా మనసునీ.. నా మనసులోని నీ జ్ఞాపకాలను
కనీసం స్పురించాలేవు ప్రియతమా... 

ఇట్లు.., ♥♥```నీ నేను```♥♥

No comments:

Post a Comment